కరాచీ: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ క్లీన్ స్వీప్ చేసింది. గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో విండీస్‌పై పాక్ 7 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్లు నిర్ణీత 20 ఓవర్లకు మూడు వికెట్లను కోల్పోయి 207 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (64) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదనలో పాక్ 18.5 ఓవర్లకు 208 పరుగులు చేసింది. రిజ్వాన్ (87) కెప్టెన్ బాబర్ ఆజమ్ (79) మెరిశారు.కరీబియన్ జట్టులో మొత్తం కరోనా కేసులు 9కి చేరడంతో ఆటగాళ్ల క్షేమం దృష్ట్యా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను వాయిదా వేశారు.