తౌరోబా : వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్థాన్ అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం జరిగిన తొలి వన్డేలో పాక్ 5 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని పాక్ 48.5 ఓవర్లలో 284/5 స్కోరు చేసింది. హసన్ నవాజ్(63 నాటౌట్), కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్(53) అర్ధసెంచరీలతో రాణించారు. 16 పరుగులకే ఓపెనర్ సయిమ్ ఆయూబ్(5) వికెట్ కోల్పోయిన పాక్‌ను నవాజ్, రిజ్వాన్‌తో పాటు బాబర్ ఆజమ్(47), హుసేన్ తలాత్(41 నాటౌట్) ఆదుకున్నారు.
విండీస్ బౌలింగ్ దాడిని సమర్థంగా నిలువరిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ముఖ్యంగా నవాజ్, హుసేన్ ఆరో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యంతో జట్టు విజయంలో కీలకమయ్యారు. జోసెఫ్ వేసిన 49వ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో నవాజ్ పాక్‌కు విజయాన్నందించాడు. అంతకుముందు ఆఫ్రిది(4/51), నసీమ్షా(3/55) ధాటికి విండీస్ 49 ఓవర్లలో 280 పరుగులు చేసింది.