Pakistan | ముల్తాన్: సొంతగడ్డపై 11 టెస్టు మ్యాచ్‌ల అనంతరం (సుమారు మూడున్నరేండ్ల తర్వాత) పాకిస్థాన్‌కు ఎట్టకేలకు ఓ విజయం దక్కింది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టును ఆ జట్టు 152 పరుగుల తేడాతో గెలుచుకుంది.
నాలుగో రోజు విజయానికి 261 పరుగులు చేయాల్సిన దశలో ఓవర్ నైట్ స్కోరు 36/2 వద్ద బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్.. 144 పరుగులకే కుప్పకూలింది. పాక్ స్పిన్నర్ నోమన్ అలీ (8/46), సాజిద్ ఖాన్ (2/93) ఇంగ్లీష్ జట్టును కట్టడిచేశారు. బెన్ స్టోక్స్ (37), బ్రైండన్ కార్స్ (27) పాక్ విజయాన్ని ఆలస్యం చేశారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ వికెట్లన్నీ (రెండు ఇన్నింగ్స్‌లలో) సాజిద్ ఖాన్, నోమన్ అలీకే దక్కడం గమనార్హం.