PAK Vs SL | పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న టీ23 ట్రై సిరీస్ నుంచి కెప్టెన్ చరిత్ అసలంకతో సహా జట్టులోని ఇద్దరు సీనియర్ ప్లేయర్ ఆరోగ్య సమస్యలతో తిరిగి స్వదేశానికి రానున్నారని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. పాకిస్తాన్, జింబాబ్వే, శ్రీలంక జట్లు ట్రై సిరీస్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ ట్రై సిరీస్‌లో కెప్టెన్ దాసున్ షనకాను కెప్టెన్‌గా నియమించింది. ఫాస్ట్ బౌలర్ అసిత ఫెర్నాండో స్థానంలో పవన్ రత్నాయకే జట్టులోకి తీసుకున్నట్లు శ్రీలంక క్రికెట్ ఒక ప్రకటనలో తెలిపింది. కెప్టెన్ చరిత్ అసలంక, ఫాస్ట్ బౌలర్ అసిత్ ఫెర్నాండో ఇద్దరూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. దాంతో స్వదేశానికి తిరిగి రానున్నారని తెలిపింది. శ్రీలంక, పాకిస్తాన్, జింబాబ్వే మధ్య జరగనున్న ట్రై-సిరీస్‌కు ఇద్దరూ దూరంగా ఉంటారని ‘ఎక్స్’పోస్ట్‌లో పేర్కొంది. అయితే, వారికి ఏమైంది.. ఏ సమస్యతో బాధపడుతున్నారన్నది మాత్రం చెప్పలేదు.
బిజీ సీజన్‌కు ముందు ఇద్దరికి సరైన వైద్య సహాయం అందించేందుకు ఇద్దరు ఆటగాళ్లను వెనక్కి పిలిచినట్లు బోర్డు పేర్కొంది. ఈ ముందు జాగ్రత్త నిర్ణయంతో వారికి సరైన సంరక్షణ లభిస్తుందని.. భవిష్యత్ మ్యాచ్‌లకు ముందు కోలుకోవడానికి తగినంత సమయం ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. అసలంక స్థానంలో దాసున్ షనకా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని.. అసిత ఫెర్నాండో స్థానంలో పవన్ రత్నాయకేను టీ20 అంతర్జాతీయ జట్టులో చోటు కల్పించినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. ఇస్లామాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోరమైన ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భద్రతా సమస్యలతో పలువురు శ్రీలంక క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిపోవాలని భావించారు. కానీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ భారీ భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో శ్రీలంక బోర్డు ప్లేయర్లను ఒప్పించింది. గతంలో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్ర దాడి జరిగిన విషయం తెలిసిందే.