షార్జా: పటిష్ట పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఎదురీదుతోంది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన స్కాట్లాండ్కు చాలా నెమ్మదైన ఆరంభం లభించింది. జార్జ్ మున్సే (15 నాటౌట్), కైల్ కోట్జర్ (9) భారీ షాట్లు ఆడలేకపోయారు. ఈ క్రమంలోనే కోట్జర్‌ను హసన్ అలీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ మాత్యూ క్రాస్ (5) దురదృష్టవశాత్తూ అవుటయ్యాడు.
ఇమాద్ వాసిం వేసిన బంతిని మున్సే స్ట్రెయిట్ షాట్ ఆడాడు. దాన్ని అడ్డుకోవడానికి ఇమాద్ చేయిచాచాడు. అతని చేతికి తగిలిన బంతి వెళ్లి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లకు తగిలింది. అప్పటికి క్రాస్ క్రీజు దాటేసి ఉన్నాడు. దీంతో అతను రనౌట్ అయ్యాడు. దీంతో 9 ఓవర్లు ముగిసే సరికి స్కాట్లాండ్ జట్టు 37/2తో నిలిచింది.