షార్జా: టీ20 ప్రపంచకప్ గ్రూప్-2లో టేబుల్ టాపర్గా ఉన్న పాకిస్థాన్, పసికూన స్కాట్లాండ్తో మ్యాచ్కు సిద్ధమైంది. ఈ టోర్నీలో సూపర్-12 దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడని పాకిస్థాన్, ఒక్క మ్యాచ్ కూడా గెలవని స్కాట్లాండ్ మధ్య షార్జా వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ సారధి బాబర్ ఆజమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
పాక్ జట్టులో ఎటువంటి మార్పులూ లేవని బాబర్ తెలిపాడు. స్కాట్లాండ్ జట్టులో రెండు మార్పులు జరిగినట్లు ఆ జట్టు సారధి కైల్ కోట్జర్ వెల్లడించాడు. మాక్లాయిడ్, ఇవాన్స్ ఆడటం లేదని, వారి స్థానాల్లో తాహిర్, బడ్జ్ ఆడుతున్నారని చెప్పాడు.
పాకిస్థాన్: బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, మొహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వాసిమ్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ షా అఫ్రిది
స్కాట్లాండ్: జార్జ్ మున్సే, కైల్ కోట్జర్, డైలన్ బడ్జ్, రిచీ బెర్రింగ్టన్, మైకేల్ లీస్క్, మాథ్యూ క్రాస్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వ్యాట్, సఫ్యాన్ షరీఫ్, హంజా తాహిర్, బ్రాడ్ వీల్