లాహోర్ : పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య లాహోర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు రసవత్తర మలుపులు తిరిగింది. మ్యాచ్‌లో ఒకే రోజు ఏకంగా 16 వికెట్లు నేలకూలాయి. ఓవర్‌నైట్ స్కోరు 216/6తో ఆట ఆరంభించిన సౌతాఫ్రికా.. స్పిన్నర్ నొమన్ అలీ (6/112) విజృంభణతో 53 రన్స్ మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌కు 109 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది.
రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన ఆ జట్టు.. 167 రన్స్‌కే కుప్పకూలింది. సఫారీ స్పిన్నర్ సెనురన్ ముత్తుస్వామి (5/57), హర్మర్ (4/51) ఆతిథ్య జట్టు పనిపట్టారు. 273 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 51/2తో నిలిచింది.