Haris Rauf : టీ20 వరల్డ్ కప్‌ను పాకిస్థాన్(Pakistan) ఓటమితో ఆరంభించింది. ఆతిథ్య అమెరికా(USA) పట్టుదల ముందు నిలువలేక సూపర్ ఓవర్లో మ్యాచ్ చేజార్చుకుంది. అసలే . ఊహించని పరాభవంతో కుమిలిపోతున్న బాబార్ ఆజాం(Babar Azam) బృందానికి మరో షాకింగ్ న్యూస్. ఆ జట్టు ప్రధాన పేసర్ హ్యారిస్ రవుఫ్ (Haris Rauf) బాల్ ట్యాంపరింగ్(Ball Tampering) ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. యూఎస్ఏతో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రవుఫ్ ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడని అమెరికా మాజీ ఆటగాడు రస్టీ థెరాన్(Rusty Theron) ఆరోపించాడు.
‘అమెరికా ఇన్నింగ్స్ సమయంలో రవుఫ్ బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించాడు. అప్పుడే తీసుకున్న కొత్త బాల్‌ను అతడు తన వేలి గోరుతో రక్కాడు. దాంతో, రెండు ఓవర్లకే పాక్ జట్టు కొత్త బంతిని తీసుకుంది. ఈ విషయాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకోవాలి’ అని రస్టీ వెల్లడించాడు.
@ICC are we just going to pretend Pakistan aren’t scratching the hell out of this freshly changed ball? Reversing the ball that’s just been changed 2 overs ago? You can literally see Harris Rauf running his thumb nail over the ball at the top of his mark. @usacricket #PakvsUSA
— Rusty Theron (@RustyTheron) June 6, 2024
అయితే.. ఈ వ్యవహారంపై ఐసీసీ మాత్రం ఇంకా స్పందించలేదు. ఒకవేళ పాక్ పేసర్ బంతిని గోరుతో గీరడం వీడియోలో రికార్డు అయి ఉంటే మాత్రం నిషేధానికి గురవ్వడం ఖాయం. గతంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిది(Shaheed Afridi) సైతం ఈ నేరానికి పాల్పడడం చూశాం. ఆల్‌రౌండర్ ఆఫ్రిది బంతిని నోట్లో పెట్టి కొరికి.. బంతి మార్చాలంటూ అంపైర్లను అడగడం వీడియోలో రికార్డయ్యింది.
ICC needs to review the footage of the PAK vs USA match to address all the allegations. However, nobody would be surprised if the allegations are true since Pakistani cricketers used to do ball tampering in the past as wellpic.twitter.com/JA1xkkpaHp
— Crypto Cricketer (@cricketcoast) June 7, 2024
ఆరంభ పోరులోనే కెనడాపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన అమెరికా జట్టు పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పట్టించింది. బాబర్ సేనను 159 పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాత మొనాక్ పటేల్(50), అరోన్ జోన్స్(36 నాటౌట్) మెరపులతో స్కోర్ సమం చేసింది. దాంతో, విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. తొలుత మహ్మద్ అమిర్ 7 వైడ్స్ వేయడంతో అమెరికా 18 రన్స్ చేయగా.. అనంతరం పాకిస్థాన్ 13 పరుగులకే పరిమితమైంది.
The American fairytale continues 🇺🇸😍
USA beat Pakistan in one of the biggest results in #T20WorldCup history and are ready to take on India next.
Get your tickets now ➡️ https://t.co/FokQ0Cegga pic.twitter.com/ydqEQ3Onbx
— ICC (@ICC) June 6, 2024