PAK vs CAN : కెనడా నిర్దేశించిన స్వల్ప ఛేదనలో పాకిస్థాన్(Pakistan) తొలి వికెట్ పడింది. బాబర్ ఆజాం స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన సయీం ఆయూబ్(6)ను ఔటయ్యాడు. పేసర్ డిల్లాన్ హోలిగర్ ఓవర్లో శ్రేయాస్ మొవ్వ చేతికి దొరికాడు. ప్రస్తుతం సీనియర్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(16), కెప్టెన్ బాబర్ ఆజాం(0)లు క్రీజలో ఉన్నారు. పవర్ ప్లేలో పాక్ స్కోర్.. 28/1. బాబర్ సేన విజయానికి 84 బంతుల్లో 79 రన్స్ కావాలి.
న్యూయార్క్ స్టేడియంలో కెనడాను పాకిస్థాన్‌కు బౌలర్లు స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. పాక్ పేసర్ల ధాటికి సాద్ బిన్ సేన 106 పరుగులకే పరిమితమైంది. లో స్కోరింగ్ పిచ్‌పై కెనడా ఓపెనర్ అరోన్ జాన్సన్(52) ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడిన ఈ చిచ్చరపిడుగు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆఖర్లో కలీమ్ సనా(13 నాటౌట్)లు కెప్టెన్ సాద్ బిన్ జాఫర్(10)లు దంచడంతో పాక్‌కు కెనడా మోస్తురు లక్ష్యాన్ని ఉంచగలిగింది.
Canada set Pakistan a target of 107 – how tricky will the chase be?https://t.co/veYkPxHeUV | #PAKvCAN | #T20WorldCup pic.twitter.com/ldiXEBAavS
— ESPNcricinfo (@ESPNcricinfo) June 11, 2024