WTC | పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. డబ్ల్యూటీసీలో ఏకంగా 8 పాయింట్లు కోత..!
WTC : బంగ్లాదేశ్ పర్యటనలో దారుణ ఓటమిని మరిచిపోకముందే పాకిస్థాన్(Pakistan)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢాకా టెస్టులో స్లో ఓవర్ రేటు(Slow Over Rate)కు పాక్ భారీ మూల్యం చెల్లించుకుంది.
WTC : బంగ్లాదేశ్ పర్యటనలో దారుణ ఓటమిని మరిచిపోకముందే పాకిస్థాన్(Pakistan)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢాకా టెస్టులో స్లో ఓవర్ రేటు(Slow Over Rate)కు పాక్ భారీ మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ ఫీజులో కోతతో పాటు ఆ జట్టు ర్యాంకింగ్‌లోనూ దిగజారింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన పాయింట్లు కోల్పోయింది. ఒకటి రెండు కాదు ఏకంగా 8 పాయింట్లు కోతకు గురైంది షాన్ మసూద్ బృందం.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో పాకిస్థాన్‌కు ఊహించని షాక్. బంగ్లాదేశ్ చేతిలో 104 పరుగుల తేడాతో తొలి టెస్టులో ఓటమి పాక్ ర్యాంకింగ్స్‌ను దెబ్బతీసింది. ఆ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోల్పోయింది. నిర్ణీత సమయానికి ఎనిమిది ఓవర్లు వెనుకంజలో ఉండడంతో జరిమానా కింద డబ్ల్యూటీసీలో 8 పాయింట్ల కోత పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ రెండులో ఉంది. దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్ వరసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.
JUST IN: Pakistan have lost eight WTC points and 40% of their match fee for keeping a slow over-rate in their loss to Bangladesh in the first Test in Dhaka.
The visitors were found to be eight overs short of the target pic.twitter.com/oVsLHl8ech
— ESPNcricinfo (@ESPNcricinfo) May 15, 2026
నహీద్ విజృంభణతో..
ఢాకా వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్లను వణకిస్తూ బంగ్లాదేశ్ భారీ విజయాన్నందుకుంది. దమ్ముంటే మా ముందు 70 ఓవర్లలో 260పైగా లక్ష్యాన్ని నిర్దేశించండి అని సవాల్ విసిరిన సల్మాన్ అఘా తల పొగరను అణచివేస్తూ సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది.

మొదటి ఇన్నింగ్స్‌లో కాస్తో కూస్తో పోరాడిన పాక్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కుప్పకూలింది. నహిద్ రాణా(5-40) బంతితో చెలరేగిన వేళ బంగ్లా 104 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా స్వదేశంలో పాక్‌పై బంగ్లాదేశ్ మొదటి విజయంతో చరిత్ర సృష్టించింది. ఇరుజట్ల మధ్య మే 16 నుంచి రెండో టెస్టు జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

