IND vs PAK : భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిని పుష్కరకాలం దాటుతోంది. ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series)ల ఊసే లేకపోగా ఐసీసీ ఈవెంట్లలోనే ఇరుజట్లు తలపడుతున్నాయి. నిరుడు ఆసియా కప్(Asia Cup)లో ఎదుపడిన చిరకాల ప్రత్యర్థులు.. ఈసారి పొట్టి ప్రపంచకప్‌లో శ్రీలంక వేదికగా ఢీ కొట్టన్నాయి. దాయాదుల హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. మాజీ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ (Saqlain Mushtaq) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలు క్షీణించడానికి రాజకీయాలే కారణమని అతడు మండిపడ్డాడు.
భారత్‌లో వరల్డ్‌కప్ ఆడబోమని పట్టుపట్టిన బంగ్లాదేశ్‌కు మద్దతిచ్చిన పాకిస్థాన్.. చివరకు ఐసీసీ ఇచ్చిన షాక్‌తో తోకముడిచింది. బంగ్లాదేశ్‌ను తప్పించగానే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) ‘మా జట్టు ఆడుతోందో లేదో తెలియద’ని కామెంట్ చేసి అగ్గి రాజేయాలనుకున్నాడు. కానీ, బంగ్లాకు పట్టిన గతే తమ జట్టుకు పడతుందని వెనక్కి తగ్గాడు. మరునాడు స్క్వాడ్‌ను ప్రకటించారు సెలెక్టర్లు. ఎప్పటిలానే భారత్, పాకిస్థాన్ జట్లు తటస్థ వేదికపై ఆడబోతున్నాయి. దాయాదుల క్రికెట్ సంబంధాల గురించి సక్లెయిన్ ముస్తాక్ మాట్లాడుతూ రాజకీయాలే ఇరుదేశాల మధ్య క్రికెట్‌కు అవరోధంగా మారాయని అన్నాడు.
I agree with maulvi Saqlain Mushtaq, Mohsin Naqvi should be removed. https://t.co/hB15u5u4Oy
— Twelfth_Man (@ChotaLittl25535) January 27, 2026
‘నా దృష్టిలో రాజకీయాలు మానవాళికి ప్రమాదకరం. కాబట్టి వీటిని రద్దు చేయాలి. రాజకీయాలు మనందరి శత్రువు. క్రికెట్‌ను మాత్రమే నాశనం చేయడం లేదు.. యావత్ మానవాళి ఈ రాకాసికి బలవుతోంది. పొలిటిక్స్ కారణంగా క్రికెట్‌కు, ఆటగాళ్లకు మాత్రమే నష్టం వాటిల్లడం లేదు. క్రికెట్ అనేది దేశాలను కలపాలి తప్ప విడగొట్టకూడదు. క్రికెట్ అనేది వినోదం కోసం.
ఇదేమీ యుద్దభూమి కాదు. భారత్‌లో ప్రపంచకప్ ఆడకూడదనుకున్న బంగ్లాదేశ్‌పై నేను కామెంట్ చేయదలచుకోలేదు. నేను ఇదివరకే రాజకీయాలపై నమ్మకం లేదని చెప్పాను’ అని ముస్తాక్. 2012-13లో చివరి ద్వైపాక్షిక సిరీస్ ఆడిన భారత్, పాక్ జట్లు.. ప్రపంచకప్, ఆసియా కప్ వంటి టోర్నీల్లో తటస్థ వేదికపైనే ఆడుతున్నాయి. ఫిబ్రవరిలో మొదలయ్యే టీ20 వరల్డ్‌కప్‌లో 15వ తేదీన కొలంబోలో దాయాదుల పోరు జరుగనుంది.