Mujahid Mentality : యుద్ధంలోనే కాదు మైదానంలోనూ భారత్ ఆధిపత్యాన్ని తట్టుకోలేని పాకిస్థాన్ అడ్డదారులు తొక్కుతోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశంగా ముద్ర పడినా.. విమర్శలు ఎదురవుతున్నా దాయాది మాత్రం తన తీరు మార్చుకోవడం లేదు. సరిహద్దుల్లో చొరబాట్లు, కాల్పులుతో విధ్వంసానికి పాల్పడాలనుకుంటున్న పాక్ ముష్కరుల భారత సైన్యం పటాపంచలు చేస్తున్నా సరే వాళ్లకు బుద్ధి రావడం లేదు. ఇప్పుడు ఆ దేశ క్రికెటర్లలోనూ కొందరు ఉగ్రవాదులకు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. ఆసియాకప్ సూపర్ -4లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ అందుకు నిదర్శనం.
క్రికెట్లో సెంచరీ కొట్టినప్పుడు బ్యాటర్లు.. వికెట్లు తీసినప్పుడు బౌలర్లు సెలబ్రేట్ చేసుకోవడం మామూలే. అయితే.. ఒక్కోసారి కొందరు హద్దమీరి ప్రవర్తిస్తుంటారు. ఆసియా కప్‌లో సూపర్ 4లో భారత జట్టుతో మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు అతిగా చేశారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పేసర్ హ్యారిస్ రవుఫ్ బౌండరీ లైన్ వద్ద రెచ్చగొట్టే చేష్టలు చేశాడు. మూడేళ్ల క్రితం టీ20 వలర్డ్ కప్‌లో కోహ్లీ విధ్వంసానికి బలైన అతడిని ఫ్యాన్స్ ‘కోహ్లీ.. కోహ్లీ’ అని అరుస్తూ టీజ్ చేశారు. అందుకు అతడు వికెట్లు తీసి తన సత్తా చూపాల్సింది. కానీ ఇటివలీ పహల్గాం దాడి, ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)ఉద్రిక్తత పరిస్థితులను గుర్తు చేస్తూ.. రాకెట్ లాంచ్ అవుతున్నట్టు సంజ్ఞలు, చేతివేళ్లతో అరు అని చూపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పాడ్డాడు.
ABSOLUTE DISGRACE THAT SCUMS LIKE THESE ARE ALLOWED ON A CRICKET FIELD.
PROVING TIME AND AGAIN TERRORISM IS RUNNING IN THEIR BLOOD.
FUCK YOU, HARIS MADARCHOD RAUF.
HOPE YOU, YOUR FAMILY & YOUR COUNTRY ROT IN HELL. @ICC @BCCI #INDvPAK #IndiaVsPakistan pic.twitter.com/82630qlahC
— Baby Bruno (@Shiv_rants) September 21, 2025
అంతకుముందు ఓపెనర్ ఫర్హాన్ అర్ధ శతకానికే సెంచరీ కొట్టినంతగా హడావిడి చేశాడు. ఫీలైపోయాడు. ఏకంగా గన్ పేలుస్తున్నసెలబ్రేషన్తో భారత జట్టును, అభిమానులను ఉడికించాడు. వీరిద్దరి ప్రవర్తన చూసి మైదానంలోని వాళ్లంతా పాక్ జట్టులో ఉగ్రవాద సానుభూతి పరులున్నారా? అని చర్చించుకున్నారు. పాక్ ఆటగాళ్లు ఎన్ని ఎత్తులు వేసినా భారత ఆటగాళ్లు మాత్రం ప్రశాంతంగా ఉంటూ బ్యాట్‌తోనే బదులిచ్చారు.
Bhag rauf bhag 😡 #indvspak #Harisrauf pic.twitter.com/N4jX0f9tLO
— Piyush Arora (@cric11forecast) September 21, 2025
భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో భావోద్వేగాలు ఉండడం సహజమే. కానీ, పహల్గాం ఉగ్రదాడి.. అందుకు ప్రతిచర్యగా భారత సైన్యం చెపట్టిన ఆపరేషన్ సిందూర్ తదనంతరం పరిణామాలు మారిపోయాయి. అందుకే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్‌తో మ్యాచ్‌లో టాస్ సమయంలో, మ్యాచ్ పూర్తయ్యాక ఆ జట్టు ఆటగాళ్లకు ‘షేక్ హ్యాండ్’ ఇవ్వలేదు. ఈ అంశాన్ని పెద్దది చేస్తూ.. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్(Andy Pycroft)ను తప్పించాలని ప్రయత్నించి బొక్కాబోర్లా పడింది పాక్ క్రికెట్ బోర్డు. ఇక లీగ్ దశలో 7 వికెట్ల తేడాతో దాయాదిని చిత్తుగా ఓడించిన సూర్యకుమార్ సేన.. సూపర్ 4లోనూ ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించి తగిన బుద్ధి చెప్పింది.