Haider Ali : అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెటర్ హైదర్ అలీ (Haider Ali) అరెస్ట్ అయ్యాడు. మాంచెస్టర్ నగరంలోని పోలీసులు బెక్న్హమ్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఏ టీమ్ షాహీన్ స్క్వాడ్‌లో ఒకడైన హైదర్‌ను విచారించారు. అనంతరం అతడు బెయిల్ మీద విడుదలయ్యాడు. అయితే.. కేసులో ఇరుక్కున్న హైదర్‌పై పాకిస్తాన్ బోర్డు వేటు వేసింది. అతడి స్థానంలో మహమ్మద్ ఫయీక్ను ఎంపిక చేశారు సెలెక్టర్లు.
‘ఆగస్టు 4న అత్యాచారం కేసు రిజిస్టర్ అయినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి 24 ఏళ్ల హైదర్ అలీని అరెస్ట్ చేశాం. మాంచెస్టర్ పరిసరాల్లో జూలై 23న అత్యాచార ఘటన జరిగినట్టు తెలిసింది. ప్రస్తుతం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తునే వేగవంతం చేశాం. బాధితురాలికి అధికారులు అన్నివిధాలా సాయంగా నిలుస్తున్నారు’ అని మాంచెస్టర్ పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. హైదర్ ఇప్పటివరకూ పాక్ తరఫున రెండు వన్డేలు, 35 టీ20లు ఆడాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2020 సీజన్లో ఈ యంగ్‌స్టర్ 157 స్ట్రయిక్ రేటుతో 239 రన్స్ సాధించాడు.
Pakistan batter Haider Ali has been arrested by the Greater Manchester Police on suspicion of rape and bailed pending further enquiries https://t.co/zAJDFbZDmB
— ESPNcricinfo (@ESPNcricinfo) August 8, 2025