PSL 2026 : స్వదేశంలో జరగుతున్న టీ20 లీగ్‌లో బాల్ ట్యాంపరింగ్(Ball Tampering)కు పాల్పడిన పాకిస్థాన్ ఆటగాడు ఫఖర్ జమాన్‌పై నిషేధం పడింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) నియమావళిని ఉల్లంఘించిన అతడు రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని మంగళవారం ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది. బంతి ఆకృతిని మార్చేందుకు ప్రయత్నించిన ఫఖర్ ఆర్టికల్ 2.14ను అతిక్రమించాడు. దాంతో, అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది పాక్ బోర్డు.
అసలేం జరిగిందంటే.. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో లాహోర్ క్వాలండర్స్ జట్టుకు ఫఖర్ జమాన్ ఆడుతున్నాడు. మార్చి 29న కరాచీ కింగ్స్‌తో మ్యాచ్ సమయంలో అతడు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన అంపైర్లు లాహోర్ జట్టుకు 5 పరుగుల జరిమానా విధించడంతో పాటు కొత్త బంతిని తీసుకున్నారు. ఫఖర్ తీరును తప్పుబట్టిన అంపైర్లు షాహిద్ సైకత్, ఫైజల్ ఖాన్ అఫ్రీది.. టీవీ అంపైర్ అసిఫ్ యాకూబ్, ఫోర్త్ అంపైర్ తారీక్ రషీద్‌లు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు.
🚨 BIG EMBARASSMENT FOR PAKISTANI FANS 🚨
– Fakhar Zaman did the ball tampering on live camera & got penalized by 5 runs 😂
– Fakhar Zaman likely to be banned for 2-3 years 😯
– PSL is a League where the ball gets pink and now the ball gets tempered 😆pic.twitter.com/rbVPoW4fAD
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 30, 2026
అయితే.. ఫఖర్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని బుకాయించాడు. దాంతో, అతడిపై క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అతడు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆధారాలు చూపించిన అంపైర్లు.. రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. దాంతో, ఏప్రిల్ 3న ముల్తాన్ సుల్తాన్స్, ఏప్రిల్ 9న ఇస్లామాబాద్ యునైటెడ్ మ్యాచ్‌లకు ఈ స్టార్ బ్యాటర్ దూరం కానున్నాడు.