Media Rights : భారత్, అఫ్గనిసిస్థాన్ టీ20 సిరీస్‌ను పాకిస్థాన్ కంపెనీ లైవ్ ప్రసారం చేయనుంది. సెప్టెంబర్‌లో మొదలయ్యే ఈ పొట్టి సిరీస్ వాణిజ్య, గ్లోబల్ ప్రసార హక్కులను పాక్‌కు చెందిన ట్రాన్స్‌గ్రూప్(TransGroup) సొంతం చేసుకుంది. అదేంటీ? అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే.. పాక్ కంపెనీకి ఈ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ కాదు.. అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు.
సెప్టెంబర్ రెండో వారంలో భారత్, అఫ్గనిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ మొదలవ్వనుంది. మామూలుగా టీమిండియా సిరీస్ హక్కులు సోనీ స్పోర్ట్స్ లేదా జియో స్టార్ కంపెనీలు దక్కించుకుంటాయి. కానీ, ఆశ్చర్యంగా ఇరుజట్ల సిరీస్ మీడియా, వాణిజ్య హక్కులను పాకిస్థాన్‌కు చెందిన ట్రాన్స్‌గ్రూప్ కంపెనీ దక్కించుకుంది.
Afghanistan vs India series in New Delhi on 13, 15 and 17 September. The Afghanistan Cricket Board has awarded commercial and TV production rights to Pakistan based Trans Group, which also holds PSL and PCB rights. To avoid media attention, Trans Group has routed the project…
— Vivek Bansal (@ivivekbansal) August 26, 2026
ఎలా సాధ్యపడిందంటే.. అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు ‘గ్లోబల్ మీడియా రైట్స్ సిండికేట్ భాగస్వామి’గా ఉంది ట్రాన్స్ గ్రూప్. అందుకే.. ఈ కంపెనీకి తమ జట్టు ఆడుతున్న సిరీస్ ప్రసార హక్కులు కట్టబెట్టింది ఏసీబీ. అందుకు బీసీసీఐ కూడా అభ్యంతరం చెప్పలేదు. కానీ, మనదేశంలో మాత్రం సోనీస్పోర్ట్స్, ఫ్యాన్కోడ్లు.. ఈ సిరీస్‌ను ప్రసారం చేయనున్నాయి. సెప్టెంబర్ 13, 15, 17వ తేదీల్లో భారత్, అఫ్గనిస్థాన్ టీ20ల్లో తలపడనున్నాయి. ఇరుజట్ల మధ్య ఇదే మొట్టమొదటి ద్వైపాక్షిక సిరీస్ అయినప్పటికీ మ్యాచ్‌లు మాత్రం ఇండియాలోనే జరుగనున్నాయి.