లక్నో: ఐపీఎల్-18వ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్‌కు శుభవార్త. ఈ సీజన్లో లక్నోకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ పేసర్ అవేశ్‌ఖాన్ త్వరలో ఆ జట్టుతో చేరనున్నాడు. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగబోయే మ్యాచ్‌లో అతడు ఆడనున్నట్టు తెలుస్తోంది.
గాయం కారణంగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో పునరావాసం పొందుతున్న అవేశ్.. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించినట్టు సమాచారం. అతడు ఆడేందుకు బీసీసీఐ కూడా సమ్మతించినట్టు లక్నో వర్గాలు తెలిపాయి.