P.V. Sindhu | విరాట్ కోహ్లీ సాయం ఎప్పటికి మర్చిపోను : పి.వి. సింధు
P.V. Sindhu | భారత షట్లర్లెవరికీ సాధ్యం కాని జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను పి.వి. సింధు(P.V. Sindhu) తొలిసారిగా కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆమె విజయం వెనుక కఠిన సాధనతో పాటు భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ(Virat Kohli )ఇచ్చిన ఒక సలహా ఆమె జీవితాన్నే మార్చి వేసింది.
హైదరాబాద్ : భారత షట్లర్లెవరికీ సాధ్యం కాని జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను పి.వి. సింధు(P.V. Sindhu) తొలిసారిగా కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆమె విజయం వెనుక కఠిన సాధనతో పాటు భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ(Virat Kohli )ఇచ్చిన ఒక సలహా ఆమె జీవితాన్నే మార్చి వేసింది. ఈ టోర్నీకి ముందు సింధు ఫామ్ కోల్పోయి కెరీర్ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె కోహ్లీని సంప్రదించాక సవాళ్లను అధిగమించి విజేతగా నిలిచింది.
జీవితంలో ఏది సాధించాలన్నా నమ్మకం అనేది అత్యంత కీలకమైంది. లక్ష్యాన్ని చేరే క్రమంలో దారులన్నీ మూసుకుపోయి తీవ్ర నిరాశలో కొట్టుమిట్లాడుతున్నప్పుడు నిజాయితీతో కూడిన చిన్న మాట సాయమైనా అద్భుతాలు చేసేలా ప్రేరిపిస్తుంది. సరిగ్గా రెండేండ్ల కింద వరకు ఇలాంటి క్లిష్ట పరిస్థితని ఎదుర్కొన్న పి.వి. సింధు స్టార్ క్రికెటర్ కింగ్ కోహ్లీని కలువడంతో అతడిచ్చిన విలువైన సూచనలు తన కెరీర్‌నే మార్చివేసిందని సింధు తెలిపారు.
తాను కెరీర్ పరంగా ఫామ్ కోల్లోయి తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో విరాట్ భాయ్‌ని నా భర్త దత్తాతో వెళ్లి కలిశానని తెలిపారు. వెంటనే ఆయన స్పందించాడన్నారు. ఫామ్ కోల్పోయిన సమయంలో సెంచరీ కోసం సుదీర్ఘ నిరీక్షణను ఎలా అధిగమించారని సింధు కోహ్లీని అడగగా.. కింగ్ కోహ్లీ స్పందిస్తూ పరుగులు చేయడమే తన పని అని, అందులోనే ఆనందాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను’ అని అతడు చెప్పినట్లు ఆమె తెలిపారు. విరాట్ చెప్పిన మాటలు తనపై ప్రభావం చూపాయని ఆతని పాజిటివ్ వైఖరిని బ్యాట్మింటన్‌కు అప్లై చేసుకొని ఫలితాలను సాధించినట్ల చెప్పారు.
విరాట్ భాయ్‌కి ఎప్పటికి రుణపడి ఉంటామని పి.వి. సింధు తెలిపారు. కాగా, పారిస్ ఒలింపిక్స్ అనంతరం సింధు ఆటతీరుపై స్పోర్ట్స్ సైన్స్ ఆధారంగా విశ్లేషణ జరిపామని దత్త సాయి తెలిపారు. దూకుడుగా ఆడటం తగ్గించి, అవసరానికి మించి లైన్ కాల్స్‌పై ఆధారపడటం వంటి లోపాలను గుర్తించి వాటిపై ప్రత్యేకంగా పనిచేశామని వివరించారు. కోచ్‌లు, ఫిట్నెస్ నిపుణుల సూచనల మేరకు ఆహార నియమాలు కూడా కచ్చితంగా పాటించడం వల్లే టైటిల్ సాధ్యమైందని పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

