IPL 2025 : నరేంద్ర మోడీ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఓపెనర్లు ఎడెన్ మర్క్రమ్(28 నాటౌట్), మిచెల్ మార్ష్(22 నాటౌట్)లు దంచికొడుతున్నారు. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) పేసర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ.. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలతో చెలరేగుతున్నారు. రబడ వేసిన 6వ ఓవర్లో రెచ్చిపోయిన మర్క్రమ్ వరుసగా రెండ సిక్సర్లు బాదాడు. దాంతో, స్కోర్ 50 దాటింది. పవర్ ప్లేలో లక్నో వికెట్ కోల్పోకుండా 53 పరుగులు చేసింది.
టాస్ ఓడిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు మర్క్రమ్(28 నాటౌట్), మిచెల్ మార్ష్(22 నాటౌట్)లు శుభారంభం ఇచ్చారు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తొలి బంతికే ఫోర్ బాదిన మర్క్రమ్.. ఆ తర్వాత అర్షద్ ఖాన్ ఓవర్లో 4 కొట్టగా.. మార్ష్ మూడో బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. అయితే.. సిరాజ్ 3వ ఓవర్లో 4 పరుగులే ఇచ్చి లక్నో స్కోర్ వేగానికి బ్రేకులు వేశాడు. 6వ ఓవర్లో రెచ్చిపోయిన మర్క్రమ్.. రబడను ఉతికేస్తూ రెండు భారీ సిక్సర్లు బాదాడు.
Trailer of an 𝙈𝙣𝙈 𝙨𝙝𝙤𝙬? 😉🎬
Updates ▶ https://t.co/NwAHcYJT2n #TATAIPL | #GTvLSG pic.twitter.com/HnH5jugnvt
— IndianPremierLeague (@IPL) May 22, 2025