లక్నో: వరల్డ్ కప్‌లో వరుస ఓటములతో కుంగిపోయిన ఆస్ట్రేలియాకు శుభవార్త! గాయం నుంచి కోలుకున్న విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ త్వరలోనే జట్టుతో కలువనున్నాడు. ఎడమ చేతి గాయం తగ్గడంతో హెడ్ నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలెట్టాడు. గాయం తగ్గిపోయింది. అనుకున్నదానికంటే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నా అని హెడ్ తెలిపాడు. ఈ స్టార్ ఓపెనర్ గురువారం(అక్టోబర్ 19) నాటికి భారత్‌కు రానున్నాడు. శుక్రవారం(అక్టోబర్ 25న) నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌కు హెడ్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.