మరికొన్ని రోజుల్లో కీలకమైన ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లన్నీ బలంగానే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కప్పు ఎవరు సాధిస్తారనే విషయంపై క్రీడాభిమానుల్లో చర్చ నడుస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగుతున్న టీమిండియా కూడా హాట్ ఫేవరెట్లలో ఒకటిగా రంగంలో దూకుతోంది.
భారత్‌ను గత టీ20 ప్రపంచకప్‌లో చిత్తుగా ఓడించిన పాక్ జట్టు కూడా ఫేవరెట్లలో ఒకటి. ఈ రెండు జట్లలోనే ఒకటి ఆసియా కప్ విజేతగా నిలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కాన్ఫిడెన్స్‌తో బరిలో దిగుతుందున్న వాట్సన్.. వారిని అడ్డుకోవడం చాలా కష్టమన్నాడు. అలాగే కొత్త ఆటతీరుతో అద్భుతంగా రాణిస్తున్న భారత్ కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీగా ఉంది.
దాంతో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కీలకంగా మారనుందని, ఈ మ్యాచ్ గెలిచిన జట్టే ఆసియా కప్ తన ఖాతాలో వేసుకుంటుందని తేల్చిచెప్పాడు. వచ్చే శనివారం ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో అంతర్జాతీయ క్రికెట్లో గ్యాప్ తీసుకున్న భారత స్టార్ ఆటగాళ్లు కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టులోకి పునరాగమనం చేస్తున్న సంగతి తెలిసిందే.