కరాచీ: పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం లభించింది. తొలి రోజు ప్రత్యర్థిని 304 పరుగులకు ఆలౌట్ చేసిన ఇంగ్లండ్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ సెంచరీ (111) చేయగా, ఒలి పోప్ (51), బెన్ ఫోక్స్ (64) అర్ధశతకాలతో రాణించారు. అబ్రార్ అహ్మద్, నౌమన్ అలీ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (14), షాన్ మసూద్ (3) క్రీజులో ఉన్నారు.