ముంబై : భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్‌గా మహేంద్రసింగ్ ధోనీ అయితే బాగుంటుందని మాజీ క్రికెటర్ ఆకాశ్‌చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలో టీమ్ఇండియా మిశ్రమ ఫలితాలు సాధిస్తుందని, ధోనీ కోచ్ అయితే పరిస్థితిలో మార్పు రావచ్చని అన్నాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు మెంటార్‌గా వ్యవహరించిన ధోనీ.. ఐపీఎల్లో చెన్నైకి సారథ్యం వహిస్తున్న కారణంగా కోచింగ్ బాధ్యతలకు దూరంగా ఉంటున్నాడని తెలిపాడు.
‘టీమ్ఇండియాకు కోచ్‌గా పని చేసేందుకు అతను ఆసక్తితో ఉన్నట్లు అనుకోవడం లేదు. కోచింగ్ అనేది క్లిష్టమైనది. సంవత్సరంలో దాదాపు 10 నెలలు కుటుంబానికి దూరంగా గడపాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది క్రికెటర్లు కోచింగ్ వైపు మొగ్గుచూపడం లేదు. దేశ క్రికెట్‌కు ఏమైనా చేయాలనుకుంటే ధోనీ కోచ్‌గా వస్తే బెటర్’ అని అన్నాడు.