Vinayak Shukla : సియా కప్ టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన ఒమన్ సంచలనాలేవీ లేకుండానే నిష్క్రమించింది. లీగ్ దశలో యూఏఈ, పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిన ఈ పసికూన చివరి పోరులో అజేయ భారత్‌ను ఢీకొడుతోంది. ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టుకు విజయం అసాధ్యమే. మరికొన్ని నిమిషాల్లో టాస్ పడనున్న వేళ ఒమన్ బ్యాటర్ వినాయక్ శుక్లా(Vinayak Shukla) ఆసక్తికర విషయం పంచుకున్నాడు. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) తనకు మంచి స్నేహితుడని వెల్లడించిన శుక్లా.. తాము కలిసి క్రికెట్ ఆడిన రోజులను గుర్తు చేసుకున్నాడిలా.
‘కుల్దీప్ నాకు స్నేహితుడు. అతడితో భారత్‌లో క్రికెట్ ఆడాను. కాన్పూర్‌లో అతడు రోవర్ క్లబ్‌కు, నేను పీఎస్ఈ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాను. ఆ సమయంలో నన్ను అతడు ఔట్ చేసినా.. నేను అతడి బౌలింగ్‌లో ఫోర్ బాదినా సరే.. ఇద్దరం చాలా సరదాగా ఉండేవాళ్లం. అవన్ని నిజంగా మధురమైన జ్ఞాపకాలు. చాలా రోజుల తర్వాత మేము మళ్లీ కలిసి మైదానంలోకి దిగనున్నాం. ఈ మెగా టోర్నీలో బలమైన భారత్, పాకిస్థాన్ వంటి జట్లతో ఆడడం నాకూ, మా జట్టు సభ్యులకు దొరికిన చక్కని అవకాశం. చిన్నప్పుడు టీవీల్లో వీళ్లను చూస్తూ పెరిగాం. భారత్‌తో మ్యాచ్ అంటే కొంత ఒత్తిడిగా ఉంది. అదే సమయంలో చాలా ఉత్సాహంగానూ అనిపిస్తోంది’ అని శుక్లా వెల్లడించాడు.
From Kanpur streets to the #AsiaCup stage❗️
🇴🇲Oman cricketer 🏏Vinayak Shukla has a unique journey — learning under MS Dhoni, and close friendship with Kuldeep Yadav.
Here’s his inspiring rise📈 pic.twitter.com/LlsCA6Q1Wo
— TOI Sports (@toisports) September 19, 2025
భారత జట్టులో చోటు కోసం నిరీక్షించిన వినాయక్ శుక్లా విదేశాల్లో ప్రయత్నించాలనుకున్నాడు. తన కలను నిజం చేసుకునేందుకు 2021 నవంబర్‌లో ఒమన్‌కు వలస వెళ్లాడు. మొదట్లో అక్కడ కొన్నాళ్లు డేటా ఆపరేటర్‌గా పని చేశాడు. ఆ తర్వాత సెలెక్టర్ల దృష్టిలో పడిన వినాయక్.. జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ‘కాన్పూర్‌లో ఉన్నప్పుడు పీఏసీ క్రికెట్ మైదానంలో స్థానిక క్లబ్స్‌కు ఆడేవాడిని. ఆ తర్వాత చాలా సిటీలకు మారాను. కానీ, ఎవరూ అవకాశం ఇవ్వలేదు. సొంత రాష్ట్రానికి ఆడాలనుకున్న నా కల ఫలించలేదు. అందుకే.. ఒమన్‌కు వలస వెళ్లాను’ అని యూఏఈ వికెట్ కీపర్ వివరించాడు.
మిడిలార్డర్ బ్యాటర్ అయిన శుక్లా 2024 డిసెంబర్లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఖతార్‌పై ఆరో స్థానంలో క్రీజులోకి వచ్చిన ఈ యంగ్‌స్టర్ కేవలం 18 బంతుల్లోనే 40 రన్స్‌తో మెరిశాడు. దాంతో.. ఒమన్ ప్రత్యర్థిని ఓడించడంలో వినాయక్ కీలక పాత్ర పోషించాడు.