Asia Cup 2025 : నిరుడు టీ20 వలర్డ్ కప్‌లో ఆడిన ఒమన్ (Oman) ఈసారి ఆసియా కప్ (Asia Cup 2025) పోటీల్లో గొప్ప ప్రదర్శన చేయానుకుంటోంది. తొలిసారి ఈ మెగా టోర్నీకి అర్హత సాధించిన ఈ పసికూన సంచలన విజయాలతో పెద్ద జట్లకు షాకివ్వాలని భావిస్తోంది. అందుకే యువకులు, సీనియర్లతో కూడిన పటిష్టమైన స్క్వాడ్‌ను ప్రకటించారు సెలెక్టర్లు. పదిహేడు మందితో కూడిన బృందానికి జతిందర్ సింగ్ (Jatinder Singh) సారథ్యం వహించనున్నాడు. మంగళవారం ఎంపిక చేసిన స్క్వాడ్‌లో నలుగురు అన్క్యాప్డ్ ప్లేయర్స్‌కు చోటు దక్కడం విశేషం.
‘ఆసియా కప్ ఆడాలనే మా కల సాకారమైంది. అంతర్జాతీయ వేదికపై తమ ప్రతిభను చాటేందుకు మా ఆటగాళ్లకు ఇది సువర్ణావకాశం. భారత్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లతో తలపడడం ఏ క్రికెటర్‌కైనా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. పొట్టి ఫార్మాట్లో ఏదైనా సాధ్యమే. ఒక్క అద్భుతమైన ఓవర్ చాలు మ్యాచ్ ఫలితం మారిపోవడానికి. మా బృందం పటిష్టంగా ఉంది. మా దేశంలో టీ20 టోర్నమెంట్ జరుగుతున్నందున మ్యాచ్ విన్నర్లనే ఆసియా కప్‌కి ఎంపికచేశాం అని ఒమన్ హెడ్‌కోచ్ దులీప్ మెండిస్ అన్నాడు.
𝐎𝐦𝐚𝐧 𝐡𝐚𝐯𝐞 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐝 𝐚 𝐧𝐞𝐰-𝐥𝐨𝐨𝐤 𝐬𝐪𝐮𝐚𝐝 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 #𝐀𝐂𝐂𝐌𝐞𝐧𝐬𝐀𝐬𝐢𝐚𝐂𝐮𝐩𝟐𝟎𝟐𝟓 🇴🇲#ACC pic.twitter.com/2YA46SSa2M
— AsianCricketCouncil (@ACCMedia1) August 26, 2025
అంతేకాదు పెద్ద జట్లతో ఆడేటప్పుడు ఒత్తిడి ఉంటుందని.. అందుకు మానసికంగా ద్రుఢంగా ఉండేలా తమ ఆటగాళ్లకు శిక్షణ ఇప్పించామని కోచ్ వెల్లడించాడు. ఆసియా కప్‌లో మేము కచ్చితంగా ప్రభావం చూపిస్తాం. క్రికెట్ దేశంగా ఒమన్ ఎదుగుతోంది అని చాటుతాం. సీనియర్లు, యువకులతో కూడిన స్క్వాడ్ అద్భుతంగా ఆడుతుందని ఆశిస్తున్నా’ అని ఆయన పేర్కొన్నాడు.
దేశవాళీలో, క్వాలిఫయర్ మ్యాచుల్లో రాణించిన కుర్రాళ్లకు ఆసియా కప్ బెర్తు కట్టబెట్టారు సెలెక్టర్లు. తొలిసారి జట్టులోకి వచ్చిన సూఫియన్ యూసుఫ్, జికిరా ఇస్లాం, ఫైజల్ షా, నదీమ్ ఖాన్లు ఈ టోర్నీతో టీ20ల్లో అరంగేట్రం చేయనున్నారు. భారత్, పాకిస్థాన్, ఈతిథ్య యూఏఈతో పాటు ఒమన్ జట్టు గ్రూప్ ఏలో ఉంది. లీగ్ దశలో సెప్టెంబర్ 12న పాకిస్థాన్‌తో తలపడనుందీ పసికూన. అనంతరం సెప్టెంబర్ 15న యూఏఈ, సెప్టెంబర్ 19న టీమిండియాను ఢీకొట్టనుంది ఒమన్.
ఒమన్ స్క్వాడ్ : జతిందర్ సింగ్(కెప్టెన్), హమ్మద్ మిర్జా, వినాయక్ శుక్లా, సుఫీయన్ యూసుఫ్, అశిష్ ఒడెదరా, అమిర్ ఖలీం, హహమ్మద్ నదీమ్, సూఫియన్ మహమూద్, అర్యాన్ బిష్త్, కరన్ సొనావలే, జిక్రియా ఇస్లాం, హస్నైన్ షా, ఫైజల్ షా, ముహమ్మద్ ఇమ్రాన్, నదీమ్ ఖాన్, షకీల్ అహ్మద్ సమయ్ శ్రీవాత్సవ.