కాలిఫోర్నియా : శతాబ్దకాల నిరీక్షణ అనంతరం లాస్ఏంజెల్స్లో జరుగబోయే 2028 ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకున్న క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసే పనులకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లను ఆడించేందుకు గాను కాలిఫోర్నియాలో పొమొనలో ఉన్న నైట్‌రైడర్స్ క్రికెట్ గ్రౌండ్‌ను ఇందుకోసం సిద్ధం చేస్తున్నది.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ యజమానిగా ఉన్న లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్ జట్టు.. అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో తమ హోంమ్యాచ్లను ఇక్కడే ఆడింది. ఇదే వేదికపై విశ్వక్రీడల్లో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నారు. ఇందు కు గాను ఈనెల 22న మైదానాన్ని పునర్నిర్మించే పనులకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజోగ్ గుప్తా, నైట్‌రైడర్స్ సీఈవో వెంకీ మైసూర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.