Paris Olympics | పారిస్: భారత క్రీడాకారుల సౌకర్యార్థం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ‘ఒలింపిక్ విలేజ్’కు 40 ఎయిర్ కూలర్లను పంపించింది. పారిస్లో ఎండలు మండిపోతుండగా పగటిపూట ఉష్ణోగ్రతలకు క్రీడాకారులు అల్లాడిపోతున్నారు. అయితే అందుకు అనుగుణంగా ఒలింపిక్ గ్రామంలో సరైన ఏసీలు అందుబాటులో లేకపోవడంతో మన అథ్లెట్లు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ విషయమై ఫ్రెంచ్ ఎంబసీతో సమావేశమైన భారత ఒలింపిక్ అసోసియేషన్.. మన ఆటగాళ్లకు ‘చల్లటి’ కబురు అందించింది.