Leander Paes | లండన్: ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత దిగ్గజం లియాండర్‌పేస్ చోటు దక్కించుకున్నాడు. తన సుదీర్ఘ కెరీర్లో 18సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచిన పేస్..ట్రోఫీలను ప్రదర్శనకు ఉంచబోతున్నాడు. తాజ్ హోటల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేస్ మీడియా ముఖంగా ప్రకటించాడు.
‘నా కెరీర్లో గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లతో పాటు నాలుగు రన్నరప్ ట్రోఫీలను ప్రదర్శనకు ఉంచబోతున్నాను. దీంతో పాటు ఒలింపిక్(1996) పతకాన్ని హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చాను. వింబుల్డన్ టెన్నిస్ రాకెట్, ఫ్రెంచ్ ఓపెన్(2016) టవల్, డేవిస్‌కప్ బ్లేజర్, ఒలింపిక్ ట్రాక్‌సూట్ ప్రదర్శనలో ఉంటాయి’ అని అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 274 మంది ప్లేయర్లతో కూడిన జాబితాలో పేస్‌కు చోటు దక్కిందని హాల్ ఆఫ్ ఫేమ్ సీఈవో డాన్ ఫేబర్ పేర్కొన్నాడు.