Manu Bhaker | చర్కీ దాద్రి (హర్యానా): మూడు రోజుల క్రితమే ప్రతిష్టాత్మక ‘ఖేల్రత్న’ అవార్డును అందుకున్న ఆనందంలో ఉన్న షూటర్ మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మను అమ్మమ్మ (సావిత్రి దేవి), మేనమామ (యుధ్వీర్) ప్రా ణాలు కోల్పోయారు.
మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఈ ఇద్దరూ ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. హర్యానా ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్న యుధ్వీర్.. బైక్పై సావిత్రిని తీసుకుని ఉద్యోగానికి వెళ్తుండగా అవతలి వైపున అదుపు తప్పి వచ్చిన కారు వారిని ఢీకొట్టడంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.