హైదరాబాద్: స్టార్‌స్పోర్ట్స్ నిర్వహిస్తున్న కేబీడీ జూనియర్ టోర్నీలో ఓబుల్‌రెడ్డి స్కూల్ సూపర్-8లోకి దూసుకెళ్లింది. గురువారం ఓబుల్‌రెడ్డి ఇండోర్ కాంప్లెక్స్‌లో జరిగిన లీగ్ పోటీల్లో ఇతర పాఠశాలలను ఓడించి ఓబుల్‌రెడ్డి స్కూల్ సూపర్-8కు అర్హత సాధించింది. హైదరాబాద్ లెగ్ ఫైనల్స్ ఈ నెల 23న గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతాయి.
2017లో జాతీయ స్థాయిలో మొదలైన జానియర్ కబడ్డీ పోటీలు కరోనా వైరస్ విజృంభణ కారణంగా నిర్వహించలేదు. అయితే పరిస్థితులు చక్కబడటంతో 2023లో సీజన్ 4ను ప్రారంభించారు. కబడ్డీకి మరింత ప్రాచుర్యం తీసుకురావడానికి ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్ స్టార్ ఆడే స్టేడియంలోనే అవే సౌకర్యాలతో ఆడించడం ద్వారా ప్రత్యక్ష అనుభూతి కల్పించడం ఈ మ్యాచ్‌ల ఉద్దేశమని నిర్వహకులు పేర్కొన్నారు.