NZ vs SA: స్వదేశంలో భారత్‌తో మూడు ఫార్మాట్ల సిరీస్‌లు ఆడిన దక్షిణాఫ్రికా త్వరలోనే న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈనెల 4 నుంచి కివీస్.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌లో గెలిచిన విజేతకు ఇచ్చే ట్రోఫీని ‘టాంగివై షీల్డ్’ అని పిలుస్తున్నారు. విజేతలకు అందజేసే ఈ షీల్డ్ వెనుక ఓ విషాద కథ ఉంది. టెస్టు సిరీస్ ఆరంభం నేపథ్యంలో టాంగివై షీల్డ్ కథా కమామీషు ఇక్కడ చూద్దాం.
ఘోర ప్రమాదం..
అది 1953, డిసెంబర్ 24. న్యూజిలాండ్‌లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో జోహన్నస్బర్గ్ వేదికగా న్యూజిలాండ్.. సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడుతోంది. తొలి రోజు కివీస్ బౌలర్లు సౌతాఫ్రికాను కట్టడి (259-8) చేశారు. అదే రోజు రాత్రి 10.21 గంటలకు న్యూజిలాండ్‌లో వెల్లింగ్టన్ నుంచి ఆక్లాండ్ వెళ్లే టాంగివై రైలు.. వాంగెహూ నదిలో మునిగిపోయింది. 285 మంది ప్రయాణీకులతో వెళ్తున్న ఆ రైలులో ఈ ప్రమాదం కారణంగా 151 మంది మృత్యువాత పడ్డారు. న్యూజిలాండ్ చరిత్రలో ఇదే అతి పెద్ద రైలు ప్రమాదం. ప్రపంచవ్యాప్తంగా ఇది ఎనిమిదో అత్యంత దారుణమైన రైలు ప్రమాదంగా నిలిచింది.
The most poignant chapter in the long history of New Zealand and @ProteasMenCSA cricket is to be officially recognised with the unveiling of the Tangiwai Shield. #NZvSA https://t.co/m4wB4tHBET
— BLACKCAPS (@BLACKCAPS) February 1, 2024
ఈ రైలు ప్రమాదంలో కివీస్ బౌలర్ బాబ్ బ్లెయిర్ భార్య.. నెరిస్సా కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదం జరిగిన మరుసటి రోజే మ్యాచ్‌ను అర్థాంతరంగా ముగించారు. ఆ టెస్టు రెండో రోజు ఇరు దేశాల జెండాలను సగం వరకు అవనతం చేసి మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆ ప్రమాదంలో చనిపోయిన బాధితులకు గుర్తుగా న్యూజిలాండ్ – సౌతాఫ్రికా మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో గెలిచిన విజేతకు టాంగివై షీల్డ్‌ను అందించనున్నారు.
New Zealand🇳🇿 vs South Africa🇿🇦 Test series now gets officially named. The teams contest for the Tangiwai Sheild. The inaugural Tangiwai Shield series begins on 4th Feb. This has a deep story, unlike most other trophies named after cricketers.
It is to commemorate New Zealand’s… pic.twitter.com/dsWhIsA9e4
— Kausthub Gudipati (@kaustats) February 2, 2024
న్యూజిలాండ్‌లోని టాంగివై ప్రాంతం నుంచి సేకరించిన కలప నుంచి ఈ షీల్డ్ ను రూపొందించడం గమనార్హం. ఇక న్యూజిలాండ్ – సౌతాఫ్రికా టెస్టు సిరీస్ విషయానికొస్తే.. ఫిబ్రవరి 04 నుంచి 08 వరకు బే ఓవల్ లో తొలి టెస్టు జరుగనుంది. రెండో టెస్టు హమిల్టన్ వేదికగా ఫిబ్రవరి 13 నుంచి 17 వరకూ జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌కు గాను సౌతాఫ్రికా ప్రధాన ప్లేయర్లందరినీ వదిలేసి (స్వదేశంలో ఎస్ఎ20 నేపథ్యంలో) కెప్టెన్‌తో పాటే ఏకంగా ఏడుగురు కొత్త క్రికెటర్లతో బరిలోకి దిగుతున్న విషయం విదితమే.