షార్జా: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిల్యాండ్, నమీబియా జట్ల మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ రెండు జట్లు ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో తలపడటం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నమీబియా సారధి గెర్హార్డ్ ఎరాస్మస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో స్కాట్లాండ్పై ఆడిన జట్టుతోనే కివీస్ బరిలో దిగుతున్నట్లు విలియమ్సన్ వెల్లడించాడు.
అయితే నమీబియా జట్టులో రెండు మార్పులు జరిగినట్లు కెప్టెన్ ఎరాస్మన్ తెలిపాడు. డీహైడ్రేషన్ కారణంగా జేన్ ఫ్రైలింక్ తప్పుకున్నాడని, షికోంగో కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదని వెల్లడించాడు. వీరి స్థానంలో బిర్కెన్‌స్టాక్, స్కాట్జ్ జట్టులో చేరారని చెప్పాడు.
న్యూజిల్యాండ్: మార్టిన్ గప్తిల్, డారియెల్ మిచెల్, కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, శాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌథీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్
నమీబియా: స్టెఫాన్ బార్డ్, మైకేల్ వాన్ లింగెన్, క్రెగ్ విలియమ్స్, గెర్మార్డ్ ఎరాస్మస్, డేవిడ్ వీజే, జేజే స్మిత్, జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్, జేన్ గ్రీన్, కార్ల్ బిర్కెన్‌స్టాక్, రూబెన్ ట్రంపెల్మన్, బెర్నార్డ్ స్కాట్జ్