Nuwan Tushara | టీ20ల్లో శ్రీలంక పేసర్ హ్యాట్రిక్.. సంబురాల్లో ముంబై ఫ్యాన్స్
Nuwan Tushara : పవర్ హిట్లర్లకు కేరాఫ్ అయిన పొట్టి క్రికెట్(T20 Cricket)లో శ్రీలంక పేసర్ నువాన్ తుషార(Nuwan Tushara) హ్యాట్రిక్ తీశాడు. శనివారం బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగిన మూడో టీ20లో అతడు వరుసగా మూడు...
Nuwan Tushara : పవర్ హిట్లర్లకు కేరాఫ్ అయిన పొట్టి క్రికెట్(T20 Cricket)లో శ్రీలంక పేసర్ నువాన్ తుషార(Nuwan Tushara) హ్యాట్రిక్ తీశాడు. శనివారం బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగిన మూడో టీ20లో అతడు వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. దాంతో, టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన ఐదో లంక బౌలర్‌గా తుషార చరిత్ర సృష్టించాడు. తుషార ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. ఎందుకంటే.. ఐపీఎల్ 17వ సీజన్లో అతడు ముంబైకి ఆడుతున్నాడు.
శ్రీలంక నిర్దేశించిన 175 పరుగుల ఛేదనలో తుషార దెబ్బకు బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగో ఓవర్లో రెండో బంతికే అతడు నజ్ముల్ షాంటో(1)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బంతికి తౌహిద్ హృదయ్(0) ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టాడు. ఇక.. హ్యాట్రిక్ బాల్‌కు అతడు అనుభవజ్ఞుడైన మహ్మదుల్లా(0)ను ఎల్బీగా ఔట్ చేశాడు.
NUWAN THUSHARA HAT TRICK!#BANvSL #SLvBAN pic.twitter.com/cRVHgu1RBP
— Abdullah Neaz (@Neaz__Abdullah) March 9, 2024
దాంతో, టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన ఐదో లంక బౌలర్‌గా తుషార రికార్డుపుటల్లోకెక్కాడు. యార్కర్ కింగ్ లసిత్ మలింగ, తిషార పెరీరా, అకిలా ధనంజయ, వనిందు హసరంగలు అతడి కంటే ముందు హ్యాట్రిక్ వికెట్లు తీశారు. వీళ్లలో మలింగ్ ఏకంగా రెండు సార్లు(2017లో బంగ్లాదేశ్‌పై, 2019లో వెస్టిండీస్‌పై) వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. దాంతో, లంక 28 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది.
𝐖 𝐖 𝐖 dot 𝐡𝐚𝐭𝐭𝐫𝐢𝐜𝐤 dot com
Developed by – @NuwanThushara53#OneFamily #MumbaiIndians pic.twitter.com/q944risHrT
— Mumbai Indians (@mipaltan) March 9, 2024
ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు ముంబై ఫ్రాంచైజీ తుషారతో ఒప్పందం చేసుకుంది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్(SA20)లో ఎంఐ కేప్‌టౌన్(MI Capetown) తరఫున అద్భుతంగా రాణించిన ఈ స్టార్ పేసర్‌కు రూ.4.8 కోట్లు చెల్లించేందుకు సిద్దమైంది. ముంబై బౌలింగ్ కోచ్‌గా ఉన్న మాజీ పేసర్ లసిత్ మలింగ.. తుషార వేగం. కచ్చితత్వానికి పదునుపెట్టనున్నాడు. మార్చి 22న ఐపీఎల్ షరూ కానున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
-
Maldives | భారత్ బాయ్‌కాట్ పిలుపుతో మాల్దీవులపై తీవ్ర ప్రభావం.. ఆందోళన వ్యక్తం చేసిన ఆదేశ మాజీ అధ్యక్షుడు -
Gaza | గాజాలో విషాదం.. సాయం కోసం పంపిన పారాచూట్ విఫలమై ఐదుగురు మృతి
-
Rupert Murdoch | 93 ఏండ్ల వయసులో ఆరో పెండ్లి.. జూన్‌లో ఎలెనా జుకోవాతో రూపర్ట్ మర్దోక్ వివాహం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

