న్యూఢిల్లీ: భారత చదరంగంలోకి మరో చిచ్చరపిడుగు దూసుకొచ్చింది. ఇప్పటికే ప్రపంచ చెస్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ప్లేయర్లను స్ఫూర్తిగా తీసుకుంటూ మూడేండ్లకే సర్వగ్య సింగ్ కుషారా కొత్త చరిత్ర లిఖించాడు. మూడేండ్ల 7 నెలల 20 రోజుల వయసులోనే ఫిడే రేటింగ్ అందుకున్న పిన్న వయసు ప్లేయర్‌గా సర్వగ్య అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
ఈ క్రమంలో గతంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన అనిశ్ సర్కార్ పేరిట ఉన్న రికార్డు(మూడేండ్ల 8 నెలలు)ను సర్వగ్య తాజాగా అధిగమించాడు. సాధారణంగా ఫిడే రేటింగ్ అందుకోవాలంటే ఒక అంతర్జాతీయ ప్లేయర్‌పై గెలువాల్సి ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన సర్వగ్య ఏకంగా ముగ్గురు ప్లేయర్లను మట్టికరిపించడం విశేషం. ఇదిలా ఉంటే స్మార్ట్‌ఫోన్, టీవీల నుంచి దృష్టి మరల్చేందుకు తల్లిదండ్రులు సిద్దార్థ్ సింగ్, నేహా చేసిన ప్రయత్నమే సర్వగ్యను చెస్ చాంపియన్‌గా మలిచింది.