Chess Sensation Sarwagya : చదరంగం ఆటలో భారత్ నుంచి గ్రాండ్‌మాస్టర్లకు కొదవ లేదు. విశ్వనాథన్ ఆనంద్ (Viswanathan Anand) నుంచి మొదలు.. డి.గుకేశ్, అర్జున్ ఎరిగేసి, యువతరంగం దివ్యా దేశ్‌ముఖ్ వరకూ అందరూ అంతర్జాతీయంగా ఘనులే. 64 గడుల ఈ ఆటలో ఇప్పుడు ఓ మూడేళ్ల పిల్లాడు ప్రభంజనం సృష్టిస్తున్నాడు. నర్సరీ చదివే వయసులోనే ఫిడే రేటింగ్ సాధించి దిగ్గజాలను ఫిదా చేస్తున్న చిన్నారి పేరు సర్వజ్ఞ సింగ్ కుష్వహ (Sarwagya Singh Kushwaha). మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ బాలుడి ప్రతిభకు ఎవరైనా హ్యాట్సాఫ్ అనాల్సిందే. మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు కొనిచ్చిన చెస్ బోర్డు ఇప్పుడు సర్వజ్ఞ్ను రికార్డులు నెలకొల్పేలా చేయడం విశేషం.
మూడేళ్ల వయసున్న పిల్లలు ఫోన్లలో బొమ్మలు చూడడం.. ఇంట్లోని టాయ్స్‌తో ఆడుకోవడం వంటివి చేస్తారు. మొదట్లో సర్వజ్ఞ కూడా అలానే ఫోన్ కోసం మారాం చేసేవాడు. అతడి చేత ఫోన్ అలవాటు మాన్పించడానికి.. ఒకరోజు చెస్ బోర్డు కొనిచ్చారు తల్లిదండ్రులు సిద్ధార్థ్, శ్రుతి సింగ్. అంతే.. ఆప్పటినుంచి ఆ బోర్డే సర్వజ్ఞ లోకమైంది. కుమారుడి ఆసక్తిని గమనించిన పేరంట్స్ ప్రత్యేకంగా నితిన్ చౌరాసియా అనే కోచ్‌ను నియమించి మెలకువలు నేర్పించారు.
3 years 7 months 13 days old Sarwagya Singh Kushwaha of Sagar, Madhya Pradesh become the youngest FIDE Rapid Rated player
The little Sarwagya got a Rapid Rating of 1572 in December 2025 FIDE Rating list.
His debut Rapid Rating tournament was 24th RCC Rapid Rated Cup in… pic.twitter.com/w2M90MyKTu
— ChessBase India (@ChessbaseIndia) December 2, 2025
తర్ఫీదుతో రాటుదేలిన సర్వజ్ఞ ‘పిట్ట కొంచెం ఆట ఘనం అన్నట్టు’.. అద్భుతాలు చేశాడు. మధ్యప్రదేశ్, మంగళూరులో పలు టోర్నీల్లో నిలకడగా రాణించి ఫిడే రేటింగ్‌లో 1,400 పాయింట్స్ దాటి అంతర్జాతీయ స్థాయికి అర్హత సాధించాడు. ఇటీవలే అంతర్జాతీయంగా ఫిడే రేటింగ్ ఉన్న ఆటగాడిని సర్వజ్ఞ్ ఓడించి వైరలయ్యాడు. ప్రస్తుతం సర్వజ్ఞ ఫిడే రేటింగ్ 1,572. మూడేళ్ల ఏడు నెలల 20 రోజులకే అతడు ఈ ఫీట్ సాధించి.. ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన ఫిడే రేటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇదివరకూ ఈ రికార్డు భారత్‌కే చెందిన కోల్‌కతా అబ్బాయి అనిశ్ సర్కార్ (Anish Sarkar) పేరిట ఉండేది. భవిష్యత్‌లో తమ కుమారుడు గ్రాండ్‌మాస్టర్ హోదాకు చేరుకోవాలని సిద్ధార్థ్, శ్రుతి కోరుకుంటున్నారు. ప్రస్తుతం కోచ్ చౌరాసియా, జాతీయ శిక్షకుడు ఆకాశ్ ప్యాసీల నిర్దేశనంలో రోజు 4 గంటలు చదరంగం సాధన చేస్తున్నాడు సర్వజ్ఞ.
At just 3 years old, Sarvagya Singh Kushwaha from Madhya Pradesh has made history with a FIDE rating of 1572! Defeating three internationally rated players, this little champion is already making big moves on the chessboard.#SarvagyaSinghKushwaha #MadhyaPradesh #FIDE… pic.twitter.com/NUxiCaFOAR
— NewsX World (@NewsX) December 3, 2025