లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖరారైంది. హెవీ వెయిట్ బాక్సర్ నుపుర్ షెరోన్.. సెమీస్‌కు దూసుకెళ్లి దేశానికి మొదటి పతకాన్ని ఖాయం చేసింది. బుధవారం జరిగిన మహిళల 80 కిలోల క్వార్టర్స్‌లో నుపుర్.. 4-1తో ఒల్టినొయ్ సొటింబొవ (ఉజ్బెకిస్థాన్)ను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది.
పురుషుల 48 కిలోల విభాగంలో జాదుమణి సింగ్, అవినాశ్ జమ్వాల్ (65 కి.) క్వార్టర్‌కు చేరగా 85 కిలోల క్యాటగిరీలో జుగ్నూ అహ్లావత్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది.