దుబాయ్: ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. సూపర్ ఫామ్‌తో అదరగొడుతున్న బ్రూక్ తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 898 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌కే చెందిన దిగ్గజ బ్యాటర్ జోరూట్(897)ను రెండో ర్యాంక్‌కు పరిమితం చేశాడు.
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో బ్రూక్ సెంచరీ చేయడం ర్యాంకింగ్స్ పరంగా అతనికి బాగా కలిసొచ్చింది. భారత్ నుంచి యశస్వి జైస్వాల్(811), రిషబ్ పంత్(724) వరుసగా 4, 9 ర్యాంక్‌ల్లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్పీడ్‌స్టర్ బుమ్రా(890) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా(415) నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్నాడు.