మియామి గార్డెన్స్: ఆధునిక టెన్నిస్‌లో దిగ్గజ ఆటగాడిగా వెలుగొందుతున్న టాప్‌సీడ్ నొవాక్ జొకోవిచ్‌కు మియామి ఓపెన్ సింగిల్స్ ఫైనల్లో అనూహ్య షాక్ తగిలింది. 24 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న ఈ సెర్బియా ప్లేయర్‌కు 19 ఏండ్ల చెక్ రిపబ్లిక్ కుర్రాడు జాకుబ్ మెన్సిక్ ఊహించని షాకిచ్చాడు. ఆదివారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జాకుబ్.. 7-6 (7/4), 7-6 (7/4)తో జొకోవిచ్‌ను ఓడించి తన కెరీర్లో తొలి ఏటీపీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రెండు గంటల మూడు నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఫైనల్లో విజయం కోసం ఇద్దరూ పోరాడారు. రెండు సెట్లలోనూ టైబ్రేక్‌ల ద్వారా ఫలితం తేలగా రెండింటిలోనూ జాకుబ్దే పైచేయి అయింది.