న్యూయార్క్ : ఈ యేడాది యూఎస్ ఓపెన్‌లో సెర్బియా స్టార్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్ ఆడేది అనుమానంగా మారింది. కొవిడ్ వాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరించిన జొకోవిచ్..అక్కడి ప్రభుత్వ నిబంధనలు యుఎస్ ఓపెన్‌లో ఆడేందుకు అవరోధంగా మారాయి. దీనికి తోడు తాజా నిబంధనలు మరింత కఠినమయ్యాయి. అమెరికా టోర్నీలలో పాల్గొనేందుకు వచ్చే విదేశీ ఆటగాళ్లు వ్యాక్సిన్ వేసుకోవాలని అమెరికా, కెనడా ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి. మరోవైపు జొకోవిచ్‌ను యూఎస్ ఓపెన్‌లో ఆడనివ్వాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభ్యర్థనలు చేస్తున్నారు. దీనిపై అటు జొకో బృందంగాని, ఇటు టోర్నీ నిర్వాహకులుగానీ పెదవి విప్పడం లేదు.