మెల్బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన్‌ను పదోసారి గెలుచుకున్న నొవాక్ జొకోవిచ్ తిరిగి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ మూడు స్థానాలు మెరుగయ్యాడు. దీంతో ఇప్పటివరకు టాప్ ర్యాంక్‌లోని కార్లోస్ అల్కారజ్ రెండో స్థానానికి పడిపోయాడు.
పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకోవడంద్వారా జొకోవిచ్ 374వ వారం అగ్రస్థానం పదిలం చేసుకున్నాడు.