రోమ్ : టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ ఇటాలియన్ ఓపెన్ క్వార్టర్ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగిన పోరులో జొకోవిచ్ 2-6, 6-4, 2-6 స్కోరుతో ఇరవై ఏళ్ల హోల్గర్ రూనె చేతిలో ఓటమిపాలయ్యాడు. రూనె చేతిలో జొకోవిచ్ ఓడిపోవడం ఇది రెండోసారి. గత నవంబర్లో పారిస్ మాస్టర్స్ ఫైనల్లో కూడ జొకోవిచ్ రూనె చేతిలో ఓడిపోయాడు.