మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. ఇటీవల మెల్బోర్న్ టైటిల్ నెగ్గి జోరు మీదున్న జొకో.. రాడ్ లీవర్ ఎరీనా స్టేడియంలో దుమ్ము రేపాడు. మంగళవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ జొకోవిచ్ 6-3, 6-4, 6-0తో కార్బల్స్ బయెనాపై విజయం సాధించాడు.
తొలి రెండు సెట్లు ప్రత్యర్థి నుంచి జొకోకు కాస్త ప్రతిఘటన ఎదురుకాగా.. మూడో సెట్లో విజృంభించి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో రూడ్, ఆండీ ముర్రే, జ్వెరెవ్, రుబ్లేవ్, స్వార్ట్స్మన్ విజయాలు సాధించారు. మహిళల విభాగంలో జెబుర్, ప్లిస్కోవా, గార్సియా, సబలెంక ముందంజ వేశారు.