Novak Djokovic : ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందే నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) కొత్త కోచ్‌ను నియమించుకున్నాడు. ఏడాది కాలంగా కోచ్ లేకుండానే ఆడుతున్న జొకో సెర్బియాకే చెందిన విక్టర్ ట్రాయ్స్కీ (Viktor Troicki)ను హెడ్‌కోచ్‌గా పరిచయం చేశాడు. ఒకప్పుడు స్నేహితులైన ఈ ఇద్దరూ ఇప్పుడు గురు శిష్యులుగా కొత్త ప్రయాణం మొదలెట్టనున్నారు. విక్టర్‌ను కోచ్‌గా తీసుకున్న విషయాన్ని బుధవారం జకోవిచ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు.
రెండేళ్ల క్రితమే 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన జకోవిచ్.. 25వ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్నాడు. మే 22న 39వ వసంతంలో అడుగుపెట్టనున్న ఈ స్టార్ ఆటగాడు.. కొన్నిరోజులుగా ఊరిస్తున్న 25వ గ్రాండ్‌స్లామ్ గెలవాలనే కసితో ఉన్నాడు. అందుకోసం.. ఈ తరం కుర్రాళ్లు జన్నిక్ సిన్నర్, అల్కరాజ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు, తన ఆటను మరింత సానబెట్టుకునేందుకు అతడు కొత్త కోచ్‌ను నియమించుకున్నాడు. ఒకప్పుడు స్నేహితుడు, సహచరుడు అయిన విక్టర్ ట్రాయ్స్కీని నూతన కోచ్‌గా అందరికీ పరిచయం చేశాడు జకో.
Novak Djokovic has confirmed long-time friend and compatriot Viktor Troicki as his head coach ahead of next week’s French Open where the Serb will bid for a record 25th Grand Slam title.
Read: https://t.co/eQjkpvvlpp
📸 Reuters, Getty Images pic.twitter.com/QwwyTomTv4
— Sportstar (@sportstarweb) May 21, 2026
‘నా స్నేహితుడు, సహచరుడు, ఇప్పుడు కోచ్. విక్టర్ టాయ్స్కీకి స్వాగతం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో జకోవిచ్ పోస్ట్ పెట్టాడు. రొలాండ్ గరోస్ టోర్నమెంట్‌తో గురు శిష్యులుగా వీరిద్దరి జర్నీ మొదలవ్వనుంది. మాజీ టెన్నిస్ ఆటగాడైన విక్టర్‌కు ప్రస్తుతం 40 ఏళ్లు. జకోవిచ్‌తో కలిసి సెర్బియా జట్టుకు పదేళ్లకు పైగా కలిసి ఆడిన విక్టర్ వీడ్కోలు అనంతరం కోచ్ అవతారమెత్తాడు. జకో కోచింగ్ బృందంలో ఒకడిగా చేరిన విక్టర్.. అతడి ఒలింపిక్ పసిడి కలను సాకారం చేశాడు. ఈసారి హెడ్‌కోచ్‌గా వచ్చిన విక్టర్ తన శిష్యుడికి 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కట్టబెట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. మే 24 ఆదివారం నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభమవ్వనుంది.