SL vs RSA టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa) పేసర్లు విజృంభించారు. బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై అన్రిచ్ నార్జి బుల్లెటు బంతులతో శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కీలక వికెట్లు తీసి లంకను ఒత్తిడిలోకి నెట్టాడు. స్పిన్నర్ కేశవ్ మహారాజ్ సైతం తిప్పేయడంతో లంక 40కే సగం వికెట్లు కోల్పోయింది.
ఆ కాసేపటికే అసలంక(6)ను నొర్జి పెవిలియన్ పంపడంతో లంక ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం మాజీ సారథి దసున్ శనక(9), సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెల్ మాథ్యూస్(9) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. 14 ఓవర్లకు శ్రీలంక స్కోర్. 61/6.