దుబాయ్: ఆసియాకప్‌లో ఆదివారం పాకిస్థాన్‌తో(India Vs Pakistan) మ్యాచ్ గెలిచిన తర్వాత భారత క్రికెటర్లు ప్రత్యర్థి ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. వాళ్లు కేవలం పాక్ క్రికెటర్లకు మాత్రమే కాదు, ఆ తొందరలో అంపైర్లకు, మ్యాచ్ అఫీషియల్స్‌కు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదని తెలుస్తోంది. వాస్తవానికి రెండు జట్ల కెప్టెన్లు టాస్కు వెళ్లిన సమయంలో షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. సల్మాన్ ఆఘా, సూర్యకుమార్ యాదవ్ కేవలం టాస్ వేసి వెళ్లిపోయారు. ఇక మ్యాచ్ ముగిశాక కూడా సూర్య కుమార్ పాక్ క్రికెటర్లను పట్టించుకోలేదు.
పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా నేతృత్వంలోని ఆ బృందం.. భారత ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చినా.. ఇండియన్ ప్లేయర్లు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. భారత ప్లేయర్లు త్వరత్వరగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లడం పట్ల పాకిస్థాన్ నిరసన కూడా వ్యక్త ంచేసింది. ఇండియన్ టీమ్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు పాక్ క్రికెటర్లు మైదానంలో కాసేపు వేచి ఉన్నారు. కానీ సూర్య టీమ్ మాత్రం ఆ షేక్‌హ్యాండ్ తీసుకునేందుకు ఎదురుచూడలేదు.
పాక్ ఆటగాళ్లను తప్పించుకునే క్రమంలో.. మ్యాచ్ అఫీషియల్స్‌ను కూడా భారత ప్లేయర్లు పట్టించుకోలేదు. ఓ ఆంగ్ల దినపత్రిక రిపోర్టు ప్రకారం భారత ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ కూడా మైదానంలో వేచి ఉన్నాడు. కానీ తొందరగా వెళ్లే క్రమంలో మ్యాచ్ రిఫరీకి కూడా మనవాళ్లు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు.
అయితే ఇండియా ఉద్దేశాన్ని మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ ముందుగానే పాకిస్థాన్‌కు విన్నవించినట్లు తెలుస్తోంది. సూర్యకుమార్కానీ, ఇతర భారత ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వెళ్లవద్దు అని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు చెప్పినట్లు మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ తెలిపారు. అయితే టాస్ సమయంలో షేక్ హ్యాండ్ ఉండదని తమకు ముందే తెలుసు అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో చెప్పింది. కానీ భారత నిర్ణయాన్ని క్రీడాస్పూర్తికి వ్యతిరేకమన్నారు.
No handshake by Indian team.
Pakistan waited for handshake but India went to the dressing room and closed the doors.
What a humiliation by Indian team 🤣
Belt treatment for Porkis#INDvPAK #IndianCricket #INDvsPAK #indvspak2025 #AsiaCupT20 #AsiaCup #ShubmanGill #ViratKohli𓃵 pic.twitter.com/zXMXZEmiuP
— Aman (@dharma_watch) September 14, 2025