County Championship : క్రికెట్లో కొందరు బ్యాటర్లు విచిత్రంగా ఔట్ అవుతుంటారు. నిరుడు వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ ఎంజెలో మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్'(Timed Out)గా వెనుదిరిగి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఓ బ్యాటర్ ఆశ్చర్యకరరీతిలో వెనుదిరిగాడు. కౌంటీ చాంపియన్‌షిప్(County Championship)లో భాగంగా డెర్బిషైర్, నార్తంప్టన్‌షైర్ (Northamptonshire) జట్ల మధ్య మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. నార్తంప్టన్‌షైర్ ఓపెనర్ రికార్డో వస్కొన్సెలొస్(41) అర్ధ సెంచరీకి చేరువైన వేళ ప్రత్యర్థి కెప్టెన్ అఫ్ స్పిన్నర్‌ను రంగంలోకి దింపాడు.
అంతే.. ఫ్రంట్‌ఫుట్ వచ్చిన రికార్డో బంతిని అమాంతం స్టాండ్స్‌లోకి పంపిద్దామనుకున్నాడు. కానీ, అనూహ్యంగా అతడి చేతుల్లోంచి బ్యాట్ జారిపోయి గాల్లో ఎగురుతూ కొంత దూరంలో పడింది. అంతే.. బంతి నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది.
One of the more bizarre dismissals you’ll see today… #WeAreDerbyshire pic.twitter.com/6md0jHvIkS
— Derbyshire CCC (@DerbyshireCCC) May 19, 2024
ఒక్క క్షణం రికార్డోకు ఏం జరిగిందో అర్దం కాలేదు. అతడి వికెట్ లభించడంతో డెర్బిషైర్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో నార్తంప్టన్‌షైర్ జట్టు 255 పరుగుల ఆధిక్యం సాధించింది.