Durand Cup | కోల్‌కతా: ప్రతిష్టాత్మక డ్యూరండ్ కప్ లో సంచలనం. ఈ టోర్నీ చరిత్రలో అత్యధికంగా 17 టైటిల్స్ నెగ్గి 18వ టైటిల్‌పై కన్నేసిన మోహన్ బగాన్‌కు నార్త్ఈస్ట్ యూనైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎన్‌ఈయూఎఫ్‌సీ) అనూహ్య షాకిచ్చింది.
ఫైనల్లో నార్త్ఈస్ట్ యూనైటెడ్ 4-3 (2-2)తో మోహన్ బగాన్‌ను ఓడించి తొలిసారి డ్యూరండ్ కప్‌ను సొంతం చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు తలా రెండు గోల్స్‌తో సమంగా ఉండటంతో పెనాల్టీల ద్వారా తేలిన ఫలితంలో నార్త్ఈస్ట్ తొలి కప్‌ను ఎగురేసుకుపోయింది.