
MS Dhoni on Bollywood | బాలీవుడ్‌లోకి భాగస్వామ్యం కావాలని తనకు ప్రణాళికల్లేవని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సారధి మహేంద్రసింగ్ ధోనీ చెప్పాడు.బ్రాండ్లను ప్రచారకర్తగా కొనసాగడానికి ప్రాధాన్యం ఇస్తానన్నాడు. చెన్నైకి ఫేర్వేల్ మ్యాచ్ ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నేను మెరుగ్గా ఆడని రోజే నాకు ఫేర్వెల్ గేమ్ అని పేర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చివరి మ్యాచ్ ఆడాలని ఆశాభావంతో ఉన్నానని అన్నాడు. అటుపై ఫ్యాన్స్‌ను కలుస్తానన్నాడు. త్వరలో జరుగనున్న టీ-20 వరల్డ్ కప్ టోర్నీకి టీం ఇండియా జట్టుకు మెంటార్‌గా వ్యవహరించనున్నారు.
ప్రస్తుతం ఇండియా సిమెంట్స్ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ముందు కూడా తన అడ్వర్టైజ్మెంట్ అసైన్మెంట్లను కొనసాగించడానికే ప్రాధాన్యం ఇస్తా అని అన్నారు. బాలీవుడ్లో భాగస్వామి కావాలని ప్రణాళికల్లేవు. బాలీవుడ్ నా కప్ ఆఫ్ టీ కాదు.. నాకు అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి.. వాటితో సంతోషంగా ఉన్నానని చెప్పాడు. సినిమాల్లో నటించాలంటే చాలా కష్టమైన వృత్తి, దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అని అన్నాడు.