ముంబై: ప్రస్తుత ఇంగ్లండ్ టీమ్‌లో కెప్టెన్ జో రూట్ మినహా సెంచరీ బాదే సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్ మరొకరు కనిపించడం లేదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. లార్డ్స్ టెస్టు అనంతరం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడున్న ఇంగ్లండ్ టీమ్‌లో రూట్ తప్పితే స్థిరంగా క్రీజులో ఉండి వంద పరుగులు చేసే బ్యాట్స్‌మెన్ కనిపించడం లేదు. గతంలో అలిస్టర్ కుక్, మైకెల్ వాన్, పీటర్సన్, ఇయాన్ బెల్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో ఉండేవాళ్లు. కానీ ప్రస్తుత బ్రిటీష్ జట్టులోఅటువంటి బ్యాట్స్మెన్లు కానరావడం లేదు’ అని అన్నాడు. లార్డ్స్‌లో టాస్ గెలిచి కూడా రూట్ బౌలింగ్ ఎంచుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని సచిన్ చెప్పాడు. హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ త్వరగా నేర్చుకునే తత్వం ఉన్న కుర్రాడని, పరిస్థితులకు తగ్గట్టు ఎలా ఆడాలో అలవరుచుకున్నాడని ప్రశంసించాడు.