సిటీబ్యూరో, డిసెంబర్10(నమస్తే తెలంగాణ): ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగే అర్జెంటీనా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ.. ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం రాచకొండ పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. మెస్సీని చూసేందుకు టికెట్లు, పాస్లు ఉంటేనే స్టేడియానికి రావాలని, లేని వారికి ప్రవేశం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
టికెట్లు, పాస్లు లేకుండా స్టేడియానికి వచ్చి ఇబ్బంది పడవద్దని ఫుట్బాల్ అభిమానులకు సూచించారు. మెస్సీ సాకర్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రద్దీ ఏర్పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.