BAN vs HKG : ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో హాంకాంగ్(Hong Kong) బ్యాటర్లు చెలరేగారు. తామూ దంచికొట్టగలమని నిరూపిస్తూ బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు. ఓపెనర్ జీషన్ అలీ(30) శుభారంభం ఇవ్వగా.. మిడిల్ ఓవర్లలో యాసీం ముర్తాజా(28), నిజాకత్ ఖాన్(42) దూకుడుగా ఆడారు. డెత్ ఓవర్లలో నిజాకత్ సిక్సర్‌తో జట్టు స్కోర్ 130 దాటించాడు. అతడు ఔటయ్యాక.. వరుసగా వికెట్లు కోల్పోయింది హాంకాంగ్. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి143 రన్స్ చేసింది.
ఆసియా కప్ ఆరంభ పోరులో అఫ్గనిస్థాన్ చేతిలో దారుణ ఓటమి నుంచి తేరుకున్న హాంకాంగ్ బ్యాటర్లు దంచేశారు. బలమైన బంగ్లాదేశ్ బౌలింగ్ దళానికి చుక్కలు చూపించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ అన్షుమన్ రథ్ (4)ను ఔట్ చేసి తస్కిన్ బ్రేకిచ్చాడు. ఆ తర్వాత జీషన్ అలీ(30), బాబర్ హయత్(14) రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో.. స్కోర్ వేగం అందుకుంది. కానీ.. జీషన్‌ను బౌల్డ్ చేసిన తంజిమ్ రెండో వికెట్ అందించాడు.
Hong Kong finish with 143 in their 20 overs!
Nizakat Khan: 42 (40)
Tanzim Hasan Sakib: 2/21
Rishad Hossain: 2/31
Taskin Ahmed: 2/38#BANvHK #BANvsHK— Cricketism (@MidnightMusinng) September 11, 2025
అనంతరం కెప్టెన్ యసీం ముర్తాజా(28)తో కలిసి నిజాకత్ ఖాన్(42) దూకుడుగా ఆడాడు. బంగ్లా బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న ఈ ద్వయం నాలుగో వికెట్‌కు 46 రన్స్ జోడించింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీ రనౌట్ అయ్యాడు. అప్పటికీ స్కోర్.. 117/4. రిషద్ హొసేన్ ఓవర్లో సిక్సర్‌తో జట్టు స్కోర్ 130 దాటించిన నిజాకత్ మరో షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు. ఆ తర్వాత బంతికే కించిత్ షా డకౌట్ అయ్యాడు. ఆఖరి ఓవర్లో 9 రన్స్ రావడంతో ప్రత్యర్థికి 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది హాంకాంగ్.